Headingley Test : ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తొలి పరీక్షను ఎదుర్కొంటోంది. లీడ్సలోని హెడింగ్లేలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు సారథి టీమిండియాను బ్యాటింగకు ఆహ్వానించాడు. ప్రత్యర్థి పేసర్లను అలవోకగా ఆడేస్తూ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్౦, కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చారు. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన భారత క్రికెటర్లు.. తొలి టెస్టు ఆరంభానికి ముందు కూడా నివాళులు అర్పించారు.
టాస్ అనంతరం మైదానంలోకి దిగడానికి.. ఇంగ్లండ్ ఆటగాళ్లు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులు అర్పించారు. హెడింగ్లే మైదానంలోకి దిగడానికి ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. అంతేకాదు నల్లబ్యాడ్జీలు ధరించి ఆటకు సిద్ధమయ్యారు. జూన్ 12న జరిగిన ఎయిరిండియా బోయింగ్ 171 డ్రీమ్‌లైనర్ విమానం ఘోర విమాన ప్రమాదంలో అందులోని మంది ప్రాణాలు కోల్పోయారు. బీజే ఆస్పత్రి కళాశాలపై విమానం కూలడంతో వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు.
The Indian Cricket Team and the England Cricket Team observed a moment of silence in memory of the victims of the Ahmedabad plane crash ahead of the start of play on Day 1 of the first Test at Headingley, Leeds.
The teams are wearing the black armbands to express solidarity with… pic.twitter.com/Guxf1aO8iJ
— BCCI (@BCCI) June 20, 2025
యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై పలు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. భారత క్రికెటర్లు కూడా సంతాపం తెలిపారు. ఈ సంఘటనతో బాధలో ఉన్నందున డబ్ల్యూటీసీ (WTC 2023-25) ఫైనల్ సమయంలో జరగాల్సిన అండర్సన్ – టెండూల్కర్ (Anderson – Tendulkar Trophy) ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా పడింది. అయితే.. తొలి టెస్టుకు ముందు సచిన్ అండర్సన్‌లు తమ పేరుతో నిర్వహిస్తున్న ట్రోఫీని ఆవిష్కరించి మురిసిపోయారు. ఈ సిరీస్‌లో గెలుపొందిన జట్టు కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్’ (Pataudi Medal)ను ఇస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే.
Two cricketing icons. One special recognition 🤝
The legendary Sachin Tendulkar and James Anderson pose alongside the new 𝘼𝙣𝙙𝙚𝙧𝙨𝙤𝙣-𝙏𝙚𝙣𝙙𝙪𝙡𝙠𝙖𝙧 𝙏𝙧𝙤𝙥𝙝𝙮 🏆#TeamIndia | #ENGvIND | @sachin_rt | @jimmy9 pic.twitter.com/4lDCFTud21
— BCCI (@BCCI) June 19, 2025