రామాయంపేట : ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నేరుగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని రామాయంపేట డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శిరీష చెప్పారు. శుక్రవారం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట పరసర ప్రాంతాలలోని మండలాలలో ఇంటర్ పాసైన విద్యార్థినిలు తమ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 25 వరకు పొడిగించిందని అన్నారు. విద్యార్థినిలు తమ సర్టిఫికెట్లతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్యతోపాటు మంచి బోధన ఉంటుందన్నారు