Citrus Fruits Seeds | చాలా మంది సాధారణంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లను తీసుకుంటూ ఉంటారు. ఇవి పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే రుచి కోసం నిమ్మరసాన్ని ఇతర ఆహారాల మీద పిండుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పండ్లన్నీ గింజలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ గింజలను పడేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఈ గింజలను మింగేస్తూ ఉంటారు. ఈ గింజలను మింగిన తరువాత గింజలను మింగామే అని భయపడుతూ ఉంటారు. వీటి వల్ల ఏదైనా హాని కలుగుతుందో ఏమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఈ గింజలను అనుకోకుండా మింగినా భయపడాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. సిట్రస్ విత్తనాల పైన పొర హానికర సమ్మేళనాలు విడుదల అవ్వకుండా నిరోధిస్తుంది. కనుక వాటిని మింగినా భయపడాల్సిన పని లేదు. అవి జీర్ణం అవ్వకుండా అలాగే మన శరీరం గుండా మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
అలాగే కొందరికి ఈ గింజలను తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని సందేహం వస్తూ ఉంటుంది. అయితే వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని వైద్యులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ వాటి గింజలు ఎటువంటి లాభాలను అందించవు కనుక వాటిని తీసుకోకుండా ఉండడమే మంచిది. ఇక ఈ సిట్రస్ గింజలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల పేగులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. వాపుతో పాటు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఈ గింజలకు బయటి పొర గట్టిగా ఉంటుంది కనుక ఇవి జీర్ణం అవ్వకుండా శరీరం గుండా అలాగే బయటకు వెళ్తాయి. ఒకవేళ వీటిని నమలినా, చూర్ణం చేసినా అవి తక్కువ మొత్తంలో హైడ్రోజన్ సైనైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనం శరీరం ఆక్సిజన్ ను ఉపయోగించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. వీటిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉంది. వికారం, తలనొప్పి, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈ గింజలను ప్రమాదవశాత్తు తీసుకోవడం వల్ల పెద్దల్లో ఎటువంటి ప్రమాదం కలగదని వైద్యులు చెబుతున్నారు. ఇక సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం ఇన్పెక్షన్ లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. కనుక రోజువారి ఆహారంలో భాగంగా సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.