Viral News : ప్రభుత్వ అధికారి (Govt Officer) ని అంటూ ఓ మహిళ ఆప్ నేత (APP leader) ను నమ్మించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు నమ్మకంగా ఉండి ఆ తర్వాత ఒంటిపై ఉన్న నగలు (Ornaments), ఇంట్లోని నగదు (Cash), విలువైన వస్తువులతో పారిపోయింది. పంజాబ్ (Punjab) లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆప్ మాజీ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన ఫతేగఢ్ సాహిబ్ (Fathegarh Sahib) జిల్లాకు చెందిన అమరిందర్ సింగ్ (Amarinder Singh) కు.. మన్విందర్ కౌర్ (Manvinder Kaur) తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది.
అయితే కొన్నాళ్లకే ఆమె నగలు, ఇతర విలువైన వస్తువులతో ఇంటి నుంచి పరారైనట్లు అమరిందర్ ఆరోపించారు. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయగా అనేక విషయాలు వెలుగుచూశాయని చెప్పారు. మన్విందర్ కౌర్ తనను తాను పంజాబ్ సివిల్ సర్వీసెస్ అధికారిణిగా పరిచయం చేసుకున్నది. తన వయసును తప్పుగా చూపడంతోపాటు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించింది.
కానీ తాజా విచారణలో అప్పటికే ఆమెకు పెళ్లయి విడాకులైనట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు 18 ఏళ్ల కొడుకు కూడా ఉన్నట్లు బయటపడింది. దాంతో అమరిందర్ సింగ్ నిర్ఘాంతపోయారు. అమరీందర్ ఫిర్యాదు మేరకు మన్విందర్ కౌర్ సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులంతా తారన్ తరన్ జిల్లాలోని సుర్సింగ్ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.