తుంగతుర్తి, అక్టోబర్ 06 : గర్భిణులు, బాలింతలు, పిల్లలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని మార్కెట్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, తాసీల్దార్ దయానందం అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో సీడీపీవో శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ సైదులు, మార్కెట్ వైస్ ఛైర్మన్ వెంకన్న, సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.