Headingley Test : లీడ్స్‌లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (Team India) పట్టు సడలించింది. తొలి సెషన్లో దూకుడుగా ఆడిన ఓపెనర్లు ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. మరికాసేపట్లో లంచ్ అనగా.. గిల్ సేన వరుసగా రెండో వికెట్ వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ కేఎల్ రాహుల్(42)ను బ్రాండన్ కార్సే ఔట్ చేసి ఆతిథ్య జట్టకు బ్రేకిచ్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన అరంగేట్రం కుర్రాడు సాయి సుదర్శన్(0) నిరాశపరిచాడు. ఐపీఎల్లో దంచికొట్టిన అతడు తన తొలి టెస్టు మ్యాచ్‌లో సున్నాకే పెవిలియన్ చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో సాయి ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా.. వికెట్ కీపర్ ఎడమవైపు డైవ్ చేస్తూ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 91 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు పడ్డాయి. దాంతో, లంచ్‌కు వెళ్లారు ఇరుజట్ల ఆటగాళ్లు. ప్రస్తుతం ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 42 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Lunch 🍱 on the opening day of the 1st Test.#TeamIndia move to 92/2, Yashasvi Jaiswal unbeaten on 42*
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/21wp9iQQKb
— BCCI (@BCCI) June 20, 2025
ఇంగ్లండ్ పర్యటనను అనేక సవాళ్ల మధ్య మొదలుపెట్టింది టీమిండియా. సీనియర్లు వీడ్కోలు పలకడంతో టాపార్డర్ కూర్పు.. ఓపెనింగ్ జోడీ కుదిరాక హెడింగ్లేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది గిల్ సేన. ఓపెనర్ అవతారమెత్తిన కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడాడు. యశస్వీ జైస్వాల్(42 నాటౌట్)తో కలిసి చక్కని సమన్వయంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇంగ్లండ్ బౌలర్లను విసిగిస్తూ క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ తొలి గంటలో ఆత్మవిశ్వాసంతో ఆడారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత దూకుడుగా ఆడబోయినన రాహుల్ ఔటయ్యాడు. అర్ధ శతకానికి చేరువైన అతడిని బ్రాండన్ కర్సే బోల్తా కొట్టించాడు.
For a first time SINCE 2012, a visiting pair has survived the first 20 overs of a Test at Headingley 🙌
FOLLOW LIVE ⏩ https://t.co/ShJazRewwb pic.twitter.com/lcdRII4z08
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2025
ఆఫ్ సైడ్ ఊరించే బంతి వేయగా.. రాహుల్ దాన్ని కట్ చేయబోయాడు. అయితే.. స్లిప్‌లో కాచుకొని ఉన్న జోరూట్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 91 పరుగుల భాగస్వామ్యానికి ఎండ్ కార్డ్ పడింది. యశస్వీకి తోడుగా అరంగేట్రం కుర్రాడు సాయి సుదర్శన్(0) కీలక భాగస్వామ్యం నెలకొల్పుతాడని ఆశిస్తే నిరాశే ఎదురైంది. అతడు.. సున్నాకే ఔటై పెవిలియన్ చేరాడు. దాంతో.. 25.4 ఓవర్లకు భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అప్పటికే లంచ్ సమయం అయింది. రెండో సెషన్లో యశస్వీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపికగా క్రీజులో నిలిస్తే భారత్ పటిష్ట స్థితిలో నిలవడం ఖాయం.