Gaza | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israel strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతోంది. తాజాగా సహాయ ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు (Palestinians) మరణించారు.
గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (Gaza Humanitarian Foundation) నిర్వహిస్తున్న సెంట్రల్ గాజాలోని సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో సహాయ ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న వారిపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో 23 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. 20 నెలల నుంచి జరుగుతున్న ఈ గాజా పోరులో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 55,104 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది. సుమారు 1,24,901 మంది గాయపడినట్లు పేర్కొంది. హమాస్‌ను అంతమొందించి ఆ ఉగ్రసంస్థ చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.
Also Read..
Iran | భారతీయుల కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్.. నేడు ఢిల్లీకి తొలి విమానం
Israel-Iran | ఇజ్రాయెల్‌తో యుద్ధం.. ఇరాన్‌కు చైనా రహస్య సాయం..?
Pakistan | అవును.. మా కీలక సైనిక స్థావరాలపై భారత్ దాడి నిజమే : పాక్ ఉప ప్రధాని