Pakistan | అవును.. మా కీలక సైనిక స్థావరాలపై భారత్ దాడి నిజమే : పాక్ ఉప ప్రధాని
Pakistan | ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమ కీలక సైనిక స్థావరాలపై భారత్ దాడులు నిజమే అని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా వెల్లడించారు.
Pakistan | ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ (Pakistan)కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో పాక్ (Pakistan)పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఇన్నాళ్లూ తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న పాక్.. తాజాగా దాన్ని అంగీకరించింది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమ కీలక సైనిక స్థావరాలపై భారత్ దాడులు నిజమే అని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా వెల్లడించారు. రెండు కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, షోర్కోట్ వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల అనంతరం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు సౌదీ అరేబియా రంగంలోకి దిగిందని కూడా దార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
జియో న్యూస్‌తో ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ‘మేము తిరిగి దాడి చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. భారత్ చాలా వేగంగా స్పందించింది’ అని తెలిపారు. భారత్ దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ తనను వ్యక్తిగతంగా సంప్రదించారని దార్ ఈ సందర్భంగా వెల్లడించారు. సౌదీ యువరాజు తనను ఫోన్లో సంప్రదించినట్లు చెప్పారు. ‘పాకిస్థాన్ దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు తెలియజేయవచ్చా’ అని తనని అడిగినట్లు దార్ వివరించారు.
Also Read..
Mega Data Breach | చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 16 బిలియన్ల పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి
Air India | నిర్వహణపరమైన సమస్యలు.. పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

