Mega Data Breach | చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 16 బిలియన్ల పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి
Mega Data Breach | డేటా లీక్ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ (Mega Data Breach) వెలుగులోకి వచ్చింది.
Mega Data Breach | డేటా లీక్ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ (Mega Data Breach) వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్వర్డ్లు లీకైనట్లు తేలింది. చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలో ఇది ఒకటని సైబర్ భద్రతా పరిశోధకులు (cybersecurity researchers) తెలిపారు. ఫోర్బ్స్‌లోని ఓ నివేదిక ప్రకారం.. ఆపిల్ (Apple), ఫేస్బుక్, గూగుల్, (Google) గిట్‌హబ్, టెలిగ్రామ్ సహా వివిధ ప్రభుత్వ వెబ్సైట్ల యూజర్ల లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చేరాయి. అంతేకాదు వివిధ రకాల సామాజిక మాధ్యమాల యూజర్లకు సంబంధించిన వివరాలు కూడా లీకైనట్లు తేలింది.
గతంలో 184 మిలియన్ల యూజర్ల లాగిన్ వివరాలు, పాస్వర్డ్లు లీకైనట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ఇప్పుడు 16 బిలియన్ల లాగిన్ వివరాలు లీకైనట్లు వెల్లడించారు. అంతేకాదు, సైబర్ భద్రతా పరిశోధకులు మొత్తం 30 డేటాసెట్లను కూడా కనుగొన్నారు. ఒక్కో డేటాసెట్‌లో 3.5 బిలియన్ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సోషల్ మీడియా, VPN, డెవలపర్ పోర్టల్స్, అనేక ప్రధాన కంపెనీల ఖాతాల లాగిన్ ఆధారాలు ఉన్నాయి. ఆయా సంస్థలకు చెందిన ఖాతాల్లో 2025 ప్రారంభం నుంచి లాగిన్ ఖాతాల వివరాలు డేటాసెట్‌లో రికార్డ్ అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ డేటా లీక్ వెనుక అనేక గ్రూపుల ప్రమేయం ఉందని సైబర్ భద్రతా పరిశోధకులు భావిస్తున్నారు.
Also Read..
Vivo Y400 Pro | నేడు ఇండియన్ మార్కెట్లోకి వివో వై400 ప్రో 5జీ
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినా.. ఎగిసిపడుతున్న ఆహార-ఇంధనేతర ఉత్పత్తుల ధరలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

