Vivo Y400 Pro | చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో (Vivo) తన వై సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన వివో వై400 ప్రో(Vivo Y400 Pro)ని శుక్రవారం భారతీ మార్కెట్లో విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్ గతేడాది విడుదలైన వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్‌కు అడ్వాన్స్డ్ వర్షన్.
6.77 అంగుళాల AMOLED డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆంగ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగాపిక్సెల్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీని ధర విషయానికి వస్తే బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.25,000 లుగా ఉండే అవకాశం ఉంది. ఇదే రేంజ్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ4, నథింగ్ ఫోన్ 3ల, మోటరోలా ఎడ్జ్ 60కి పోటీగా నిలువనుంది. ఫెస్టివల్ గోల్డ్, ఫ్రీ స్టైల్ వైట్, నెబులా పర్పుల్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
Vivo 1