Air India | నిర్వహణపరమైన సమస్యలు.. పలు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
Air India | టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది.
Air India | టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో నిర్వహణపరమైన (maintenance) ఇబ్బందులతో జాతీయ, అంతర్జాతీయంగా నడిచే పలు విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా పలు సర్వీసులను సంస్థ రద్దు చేసింది.
నిర్వహణ, కార్యాచరణ కారణాల వల్ల నేడు జాతీయ, అంతర్జాతీయంగా నడిచే పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. రద్దైన విమానాల్లో దుబాయ్ నుంచి చెన్నైకి రావాల్సిన AI906 విమానం, ఢిల్లీ నుంచి మెల్బోర్న్కు వెళ్లాల్సిన AI308 విమానం, మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI309 విమానం, దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన AI2204 విమానం, పూణె నుంచి ఢిల్లీకి రావాల్సిన AI874 విమానం, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రావాల్సిన AI456 విమానం, హైదరాబాద్ టు ముంబైకి వెళ్లాల్సిన AI-2872 విమానం, చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సిన AI571 విమానాలు ఉన్నాయి.
Also Read..
Air India Plane Crash | 215 మృతదేహాలకు డీఎన్ఏ మ్యాచింగ్.. 198 డెడ్‌బాడీస్ అప్పగింత
బ్లాక్‌బాక్స్ డీకోడ్పై ఏఏఐబీదే నిర్ణయం: కేంద్రం
16 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

