Air India Plane Crash | 215 మృతదేహాలకు డీఎన్ఏ మ్యాచింగ్.. 198 డెడ్‌బాడీస్ అప్పగింత
Air India Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
Air India Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. డీఎన్ఏ పరీక్ష (DNA Samples) ద్వారా ఇప్పటి వరకూ 215 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేశ్ జోషి తెలిపారు. ఇప్పటి వరకూ 198 మంది డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్‌లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.
Also Read..
ఒడిశాలో మరో యువతిపై గ్యాంగ్‌రేప్
బ్లాక్‌బాక్స్ డీకోడ్పై ఏఏఐబీదే నిర్ణయం: కేంద్రం
16 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

