న్యూఢిల్లీ: గత వారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్ బాగా దెబ్బ తినడంతో దాన్ని డీ కోడ్ చేయడానికి అమెరికాకు పంపుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
దాన్ని ఎక్కడ డీకోడ్ చేయాలన్నది ఎయిర్‌క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నిర్ణయిస్తుందని తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీ, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నది. ప్రమాద ఘటనపై ఏఏఐబీ నిపుణుల బృందం దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, బ్లాక్‌బాక్స్ డాటా రికవరీ కోసం అమెరికాకు పంపించనున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి.