దేవరకొండ రూరల్, జూన్ 20 : నిబంధనలకు విరుద్ధంగా బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు, టై, బెల్ట్ లు అమ్ముతూ విద్యార్థులను దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు పాత్లవత్ లక్ష్మణ్, పొట్ట మధు, జామీర్ బాబా, పేట అభి, అంజి, వెంకటేశ్, మహేశ్, రవి పాల్గొన్నారు.