Tiger | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ (Bandipur Tiger Reserve) పరిధిలోని చామరాజనగర జిల్లాలోని ఓంకార్ రేంజ్ (Omkar range) సమీపంలో 32ఏళ్ల మహిళపై పులి (Tiger) దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లు పేట తాలూకా నివాసి పుట్టమ్మ (32) గురువారం మధ్యాహ్నం సమయంలో పశువులను మేతకు తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆమెపై పులి దాడి చేసింది. దాదాపు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అటుగా వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళపై దాడి చేసిన పులి కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు బందీపూర్ ఫారెస్ట్ అధికారి ప్రభాకరన్ తెలిపారు.
Also Read..
Students | భారీ వర్షంతో లీకేజీ.. క్లాస్‌రూమ్‌లో గొడుగులు పట్టుకుని పాఠాలువిన్న విద్యార్థులు
F 35B Fighter Jet | OLXలో సేల్కు బ్రిటన్ ఎఫ్-35 ఫైటర్ జెట్..?
Air India | ఫ్యామిలీని కోల్పోయాం.. విమాన ప్రమాదంలో మరణించిన సిబ్బందికి ఎయిర్ ఇండియా నివాళి