Students | పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భారీ వర్షం కారణంగా ఓ పాఠశాల క్లాస్ రూమ్ లీకవుతుండటంతో విద్యార్థులు (Students) గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు. ఉపాధ్యాయులు సైతం గొడుగులు (umbrella) పట్టుకునే పాఠాలు బోధించారు. ఈ ఘటన హుగ్లీ ( Hooghly) జిల్లాలో చోటు చేసుకుంది.
గత వారంరోజులుగా బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు హుగ్లీలోని ప్రాథమిక పాఠశాల మొత్తం లీకవుతోంది. మూడు తరగతి గదులు మినహా మిగతావాటన్నింటిలోనూ వర్షం నీరు కారుతోంది. దీంతో విద్యార్థులు గొడుగుల సాయంతో పాఠాలు విన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 1972లో స్థాపించిన ఈ పాఠశాల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరింది. కేవలం మూడు గదులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అవి కూడా పేలవమైన స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read..
F 35B Fighter Jet | OLXలో సేల్కు బ్రిటన్ ఎఫ్-35 ఫైటర్ జెట్..?
Air India | ఫ్యామిలీని కోల్పోయాం.. విమాన ప్రమాదంలో మరణించిన సిబ్బందికి ఎయిర్ ఇండియా నివాళి
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో పాము అంటూ పుకారు.. మహిళల కోచ్‌లో గందరగోళం.. VIDEO