Delhi Metro | ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల చేష్టలు, అక్కడ చోటుచేసుకునే వింత పోకడలకు సంబంధించిన వీడియోలు (Viral Video) తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో గందరగోళ పరిస్థితి (Massive Chaos Inside Ladies Coach) నెలకొంది.
మహిళల కోచ్‌లో పామ్ ఉందంటూ పుకారు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ పుకారుతో మహిళలు గట్టిగట్టిగా కేకలు వేస్తూ, సీట్లపై దూకుతూ బీభత్సం సృష్టించారు. అందులోని ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. అయితే, వైరల్ వీడియోలో పాము మాత్రం కనిపించలేదు. సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం కూడా తెలియదు. మెట్రో రైలులో గందరగోళానికి సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
Also Read..
VIP number | స్కూటీ ధర రూ.లక్ష.. ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.14 లక్షలు చెల్లించిన వ్యక్తి..!
Vivo Y400 Pro | మార్కెట్లోకి వివో వై400 ప్రో 5జీ.. ప్రారంభ ధర రూ.24,999
Mega Data Breach | చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 16 బిలియన్ల పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి