Vivo Y400 Pro | చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో (Vivo) తన వై సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన వివో వై400 ప్రో (Vivo Y400 Pro)ని శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్ గతేడాది విడుదలైన వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్‌కు అడ్వాన్స్డ్ వర్షన్.
6.77 అంగుళాల AMOLED డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆంగ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3D కర్వ్డ్ డిస్ప్లే, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ నెట్వర్క్ సపోర్ట్, IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
దీని ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 కాగా, 8 జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ జూన్ 27 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ప్రీ బుకింగ్‌లు నేటి నుంచే ప్రారంభమవుతాయి. మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన వివో వై400 ప్రో ఫెస్టివల్ గోల్డ్, ఫ్రీ స్టైల్ వైట్, నెబులా పర్పుల్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Vivo Y400 Pro స్పెసిఫికేషన్స్..
Also Read..
Mega Data Breach | చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 16 బిలియన్ల పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినా.. ఎగిసిపడుతున్న ఆహార-ఇంధనేతర ఉత్పత్తుల ధరలు