VIP number | ఫ్యాన్సీ నెంబర్ల (Fancy number)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న బండి కొన్నా సరే వాహనదారులు దానికి ఫ్యాన్సీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)కు చెందిన ఓ వ్యక్తి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.14 లక్షలు చెల్లించాడు. అది కూడా రూ.లక్ష విలువ చేసే యాక్టివా కోసం ఇంత చెల్లించాడు.
హమీర్పూర్ (Hamirpur)కు చెందిన సంజీవ్ కుమార్ రూ.లక్ష విలువైన యాక్టివా కొన్నాడు. అయితే, హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ (Himachal Pradesh Transport Department) నిర్వహించిన ఆన్లైన్ వేలం ద్వారా HP21C-0001 నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ వేలంలో ఇద్దరు మాత్రమే పాల్గొనగా.. మరో వ్యక్తి ఈ నంబర్ ప్లేట్ కోసం రూ.13.5 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. అయితే, సంజీవ్ కుమార్ దాన్ని రూ.14 లక్షలకు దక్కించుకున్నాడు. ఈ మొత్తాన్ని అతను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ద్విచక్ర వాహనం కోసం జారీ చేసిన అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్ ఇదే కావడం విశేషం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ‘ఆ డబ్బుతో లగ్జరీ కారే వస్తుంది కద..’, ‘కేవలం యాక్టివాకు ఇంత డబ్బు పెట్టి నెంబర్ ప్లేటా..?’, ‘ఇదెక్కడి పిచ్చి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Vivo Y400 Pro | మార్కెట్లోకి వివో వై400 ప్రో 5జీ.. ప్రారంభ ధర రూ.24,999
IndiGo | మరో విమానంలో సాంకేతిక సమస్య.. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mega Data Breach | చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 16 బిలియన్ల పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి