Air India | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పది మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మరణించిన సిబ్బందికి ఎయిర్‌లైన్స్ నివాళులర్పించింది. బరువెక్కిన హృదయంతో క్యాబిన్ సిబ్బందిని (Air India crew members) గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపింది. తమ ఫ్యామిలీని కోల్పోయామంటూ పేర్కొంది. ఈ మేరకు మరణించిన వారి సేవలను ఎయిర్‌లైన్స్ గుర్తు చేసుకుంది.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. మరణించిన వారు అపర్ణ అమోల్ మహాదిక్, శ్రద్ధా మహాదేవ్ ధావన్, దీపక్ బాలాసాహెబ్ పాఠక్, ఇర్ఫాన్ సమీర్ షేక్, లమ్నుంథెం సింగ్సన్, మైథిలి పాటిల్, కొంగ్బ్రైలత్పం నగంథోయ్ శర్మ, సైనీతా అబిన్ చక్రవర్తి, మనీషా థాపా, రోష్ని రాజేంద్ర సోంఘారేగా పేర్కొంది. వారికి ప్రత్యేకంగా నివాళులర్పించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
Also Read..
Will Crash Plane | మహిళా వైద్యురాలు దురుసు ప్రవర్తన.. విమానాన్ని కూల్చివేస్తానని బెదిరింపు
VIP number | స్కూటీ ధర రూ.లక్ష.. ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.14 లక్షలు చెల్లించిన వ్యక్తి..!
Vivo Y400 Pro | మార్కెట్లోకి వివో వై400 ప్రో 5జీ.. ప్రారంభ ధర రూ.24,999