F 35B Fighter Jet | ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets) లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది. సాంకేతిక కారణాలతో ల్యాండ్ అయిన ఈ ఫైటర్ జెట్ ఐదు రోజులు గడిచినా ఇంకా కేరళలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫైటర్ జెట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్-35 OLXలో అమ్మకానికి పెట్టినట్లు ఎక్స్‌లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీన్ని 4 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో అంతా ఇది నిజమే అని నమ్ముతున్నారు. అయితే, OLXలో మాత్రం అలాంటి పోస్టు ఏమీ లేదు. దీంతో ఇది ఫేక్ వార్త అని తేలిపోయింది.
F35 for Sale on OLX at $4M
😝😝😝#Trump pic.twitter.com/8HwmpRJL0e— Jamin (@JaminrpP) June 20, 2025
బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో ఆదివారం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇన్ని రోజులు అది ఇక్కడే ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.
ఆ ఫైటర్ జెట్‌లో సమస్యను సరిచేసిన తర్వాత తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం ఐదు రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు. కాగా ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్‌పై దాడులకు వాడుతున్నది.
Malayalis have put the British F-35 fighter jet on sale online in OLX 😂😂 pic.twitter.com/6YvzXPDefk
— Mini Nair (@minicnair) June 17, 2025
Also Read..
Air India | ఫ్యామిలీని కోల్పోయాం.. విమాన ప్రమాదంలో మరణించిన సిబ్బందికి ఎయిర్ ఇండియా నివాళి
“Fighter jet | యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..!”
“F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!”