ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ముగియడమే ఆలస్యం మరో మెగా టోర్నీ అభిమానులను అలరించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens ODI World Cup)షెడ్యూల్ను విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30న షురూ కానుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీ ఆరంభం రోజే టీమిండియా బెంగళూరులో శ్రీలంకతో తలపడనుంది.
అయితే.. టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 5న జరుగనుంది. పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ మ్యాచ్లకు లంక వేదిక కానుందని ఐసీసీ పేర్కొంది. కొలంబోలో ఏకంగా 11 లీగ్ మ్యాచ్లకు ఐసీసీ ఆమోదం తెలిపింది.
The countdown begins ⏳
The full schedule for the ICC Women’s Cricket World Cup 2025 is out 🗓
Full details ➡ https://t.co/lPlTaGmtat pic.twitter.com/JOsl2lQYpy
— ICC (@ICC) June 16, 2025
వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టనుంది. సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న భారత్, శ్రీలంకలు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. సెప్టెంబర్ 30 లంక, టీమిండియా పోరుతో మెగా టోర్నీ షురూ కానుంది. అనంతరం అక్టోబర్ 1న న్యూజిలాండ్తో ఆసీస్ తలపడనుంది. మొత్తంగా కొలంబోలో 11 లీగ్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. అక్టోబర్ 29న కొలంబో లేదా బెంగళూరులో తొలి సెమీ ఫైనల్ జరుగనుండగా.. అక్టోబర్ 30న బెంగళూరులో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్ పోరు నవంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్కు బెంగళూరు లేదా కొలంబో వేదిక కానుందని ఐసీసీ వెల్లడించింది.
సెప్టెంబర్ 30 – భారత్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 1 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – ఇండోర్
అక్టోబర్ 2 – బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 3 – ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా – బెంగళూరు
అక్టోబర్ 4 – ఆస్ట్రేలియా vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 5 – భారత్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 6 – న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా -ఇండోర్
అక్టోబర్ 7 – ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ – గువాహటి
అక్టోబర్ 8 – ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 9 – భారత్ vs దక్షిణాఫ్రికా – వైజాగ్
అక్టోబర్ 10 – న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 11 – ఇంగ్లండ్ vs శ్రీలంక – గువాహటి
అక్టోబర్ 12 – భారత్ vs ఆస్ట్రేలియా – వైజాగ్
అక్టోబర్ 13 – దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 14 – న్యూజిలాండ్ vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 15 – ఇంగ్లండ్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 16 – ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 17 – దక్షిణాఫ్రికా vs శ్రీలంక – కొలంబో
అక్టబోర్ 18 – న్యూజిలాండ్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 19 – భారత్ vs ఇంగ్లండ్ – ఇండోర్
అక్టోబర్ 20 – శ్రీలంక vs బంగ్లాదేశ్ – కొలంబో
అక్టోబర్ 21 – దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 22 – ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ – ఇండోర్
అక్టోబర్ 23 – భారత్ vs న్యూజిలాండ్ – గువాహటి
అక్టోబర్ 24 – పాకిస్థాన్ vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 25 – ఆస్ట్రేలియా vs శ్రీలంక – ఇండోర్
అక్టోబర్ 26 – ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ – గువాహటి
అక్టోబర్ 26 – భారత్ vs బంగ్లాదేశ్- బెంగళూరు
అక్టోబర్ 29 – సెమీ ఫైనల్ – గువాహటి /కొలంబో
అక్టోబర్ 30 – సెమీ ఫైనల్ 2 -బెంగళూరు
నవంబర్ 2 – ఫైనల్ – కొలంబో/ బెంగళూరు