న్యూఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి(Pakistan Minister) ఖవాజా ఆసిఫ్‌పై నెటిజన్లు మరోసారి ఆన్లైన్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఐపీఎల్ ఫ్లడ్లైట్లను హ్యాక్ చేసినట్లు ఆయన ఇటీవల కామెంట్ చేశారు. పాకిస్థాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ తమ దేశ సైబర్ యోధులు .. ఐపీఎల్లో ఫ్లడ్లైట్లను ఆఫ్ చేసినట్లు చెప్పారు. ధర్మశాలలో మే 8వ తేదీన పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగిన ఐపీఎల్లో మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్లు కాసేపు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల ఫ్లడ్‌లైట్లకు విద్యుత్తు సరఫరా జరగలేదు. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన మరుసటి రోజు ఈ ఘటన జరిగింది. అయితే పాక్ రక్షణ మంత్రి బహుశా ఈ మ్యాచ్ గురించే ప్రస్తావన చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
పాకిస్థానీ స్వదేశీ టెక్నాలజీతో ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశామని, ఇది ఇండియాకు అర్థం కాదని, మన సైబర్ వారియర్లు ఇండియాపై అటాక్ చేసినట్లు పాక్ మంత్రి ఆసిఫ్ పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ను ఆపేశారని, అలాగే ఇండియన్ డ్యామ్‌ల నుంచి నీళ్లను రిలీజ్ చేశారని, వాళ్ల విద్యుత్తు గ్రిడ్‌ను షట్‌డౌన్ చేసినట్లు మంత్రి ఆసిఫ్ చెప్పారు. ఈ సైబర్ దాడులన్నీ .. తమ సైబర్ యోధులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
29 సెకన్ల ఆసిఫ్ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. దానిపై ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు ఆన్లైన్ యూజర్లు ఆ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సైబర్ అంటే పాకిస్థాన్‌లో భిన్నమైన అర్థం, సిలబస్ ఉన్నట్లుగా ఉందని ఓ యూజర్ పేర్కొన్నాడు. వైఫైతో ఫ్లడ్‌లైట్లు నడవవని, మదరసాలో పాఠాలు చెప్పుకోండి అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఫ్లడ్లైట్లను ఆపడం సైబర్ విజయంగా భావిస్తే, మా మూడేళ్ల మేనల్లుడు జూమ్ మీటింగ్‌లో ఉన్నప్పుడు వైఫై ఆపేసినట్లు చమత్కరించాడు.
Pakistan Defence Minister: Our Cyber warriors did Wonder during this War with India – We Switched off FLOOD LIGHTS during IPL Match pic.twitter.com/k4eMe0uCMA
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 14, 2025