Monkey Steals Money | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో కొందరు పర్యాటకులకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఖర్చుల కోసమని తెచ్చుకున్న డబ్బును ఓ కోతి ఎత్తుకెళ్లింది (Monkey Steals Money). అంతటితో ఆగని వానరం.. చెట్టుపై కూర్చొని వాటిని కిందకు విసిరేసింది. ఈ ఘటన కొడైకెనాల్లో చోటు చేసుకుంది.
కొడైకెనాల్ (Kodaikana)లోని గుణ కేవ్స్ (Guna Caves) సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు గుణ గుహ సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో వారి చేతిలో ఖర్చుల కోసం అని తెచ్చుకున్న రూ.500 నోట్ల కట్ట ఉంది. దాన్ని గమనించిన ఓ వానరం.. అమాంతం లాగేసుకుంది. నోట్ల కట్టతో చెట్టెక్కి కూర్చుంది. అనంతరం ఆ కట్టలోనుంచి ఒక్కో నోటును తీసి కిందకు విసిరేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు కోతి చేసిన చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
Cash falling from trees, literally! A monkey at Guna Caves in Karnataka reportedly swiped a 500 Rupee bundle from a tourist and then proceeded to rain down the notes. Check out the viral video!#Karnataka #Monkey #ViralMoment #GunaCaves #Kodaikanal pic.twitter.com/gMFFfWqqQg
— Vikram Singh Indolia (@VikramIndolia) June 16, 2025
Also Read..
Viral Video | కదులుతున్న బైక్పై జంట రొమాన్స్.. షాకిచ్చిన పోలీసులు
Rapido Driver | షాకింగ్ ఘటన.. యువతిపై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవర్.. Video
Census | జనగణనకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం