Rapido Driver | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ర్యాపిడో బైక్ రైడర్ (Rapido Driver) ఓ అమ్మాయిపై చేయి చేసుకున్నాడు (Rapido Driver Slaps Woman). ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో రైడ్ బుక్ చేసుకుని ఈజీగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా వీటిపైనే ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ యువతి ర్యాపిడో బైక్ రైడ్ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో బైక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేశాడు. దీంతో ఆమె రైడ్‌ను మధ్యలోనే ఆపి కిందకు దిగింది. ర్యాష్ డ్రైవింగ్‌పై (Rash Driving Complaint) అతడిని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బైక్ డ్రైవర్.. ఆ యువతిపై చేయి చేసుకున్నాడు. రోడ్డుపైనే యువతి చెంప ఛెళ్లుమనిపించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది.
అక్కడున్న స్థానికులు ఈ తతంగాన్నంతా చూస్తున్నారు తప్పితే ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ నెల జూన్ 14న జయనగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ సంఘటన పై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rapido bike rider slapped a woman customer when she questioned him over rash driving & jumping signal in Bengaluru.
Argument escalated because the woman spoke only English & the rider knew only Kannada. pic.twitter.com/w32zOQWOiL
— BALA (@erbmjha) June 16, 2025
Also Read..
Bike taxi | కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్.. ఎందుకంటే..!
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Haryanvi Model: మోడల్ శీతల్ హత్య..ఎన్సీఆర్ కెనల్లో దొరికిన మృతదేహం