న్యూఢిల్లీ: ఎన్సీఆర్లోని ఖాండ నుంచి జారోతి గ్రామాల మధ్య ఉన్న కెనాల్లో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని శీతల్గా గుర్తించారు. ఆమె హర్యానాకు చెందిన మోడల్(Haryanvi Model). మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమెకు పేరున్నది. పానిపట్ సమీపంలోని ఖలీలా మజ్రా ఆమె స్వగ్రామం. ఇటీవల పానిపట్‌లోని సత్ కర్తార్ కాలేనీకి తన సోదరి నేహతో కలిసి ఇళ్లు మారింది. శీతల్ ఫోన్‌తో కాంటాక్ట్ తెగిపోవడంతో… పానిపట్‌లోని ఓల్డ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీసు స్టేషన్లో ఆదివారం నేహా ఫిర్యాదు చేసింది.
శీతల్ చివరిసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అతని కారును కూడా శీతల్ మృతదేహం లభించిన కెనాల్ వద్ద గుర్తించారు. శీతల్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ అటాక్ చేసినట్లు సోదరి నేహా తెలిపింది. దాడి గురించి శీతల్ వీడియో కాల్ చేసినట్లు నేహా చెప్పింది. ఆ వీడియో కాల్ తర్వాత ఆమె కాంటాక్ట్ తెలియకుండా పోయిందని నేహ తెలిపింది. ఆదివారం రాత్రి కెనాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పానిపట్ నుంచి ఓ అమ్మాయి మిస్సైనట్లు ఆదివారం తమకు సమాచారం వెల్లడైందని ఖర్కోడా పోలీసు స్టేషన్ ఇంచార్జ్ ప్రేమ్‌కుమార్ తెలిపారు.
ప్రాథమిక విచారణ ఆధారంగా శీతల్ మృతదేహాన్ని గుర్తించారు. ఫ్యామిలీ సభ్యులతో పోలీసులు సంప్రదించారు. శీతల్ బాయ్‌ఫ్రెండ్‌తో పాటు ఇతర కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.