Viral Video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. బైక్, కారులో ప్రయాణిస్తూ చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు నడిరోడ్డుపై పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలే అనేకం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ నోయిడాలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
ఓ జంట బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేశారు. యువకుడు బైక్ (Bike) నడుపుతుండగా.. యువతి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని అతడిని హగ్ చేసుకుంది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారి (Viral Video) నోయిడా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. వీడియో ఆధారంగా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసినందుకు గానూ రూ.53,500 భారీ జరిమానా విధించారు. బైక్‌ను సీజ్ కూడా చేశారు.
नोएडा में जान जोखिम में डाल एक्सप्रेसवे पर इश्क फरमाता दिखा प्रेमी जोड़ा,चलती बाइक पर रोमांस करते नजर आया कपल,ट्रैफिक पुलिस ने काटा 53,500 रुपये का चालान
@Uppolice @noidapolice pic.twitter.com/TH9r5NjA9m— RAVINDER JAINT (ABP NEWS) (@ravinderjaint) June 16, 2025
Also Read..
Rapido Driver | షాకింగ్ ఘటన.. యువతిపై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవర్.. Video
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?