న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద(Ahmedabad Plane Crash) సమయంలో.. రమేశ్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ఆ విమానంలో ఉన్న 242 మంది 241 మంది చనిపోగా, రమేశ్ ఒక్కడే సజీవంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బీజే మెడికల్ కాలేజీపై విమానం కూలిన తర్వాత ఆ ప్రాంతం నుంచి విశ్వాస్ కుమార్ నడిచి వస్తున్న దృశ్యాలు మొబైల్ ఫోన్లకు చిక్కిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన జరిగిన ఆ ఘటనకు చెందిన మరో వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.
కొత్త వీడియో చాలా భయానకంగా ఉంది. విమానం కూలగానే భారీగా మంటలు, పొగ వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతం నుంచి రమేశ్ ఒక్కడే నడుచుకుంటూ వచ్చాడు. అతని వెనుక భాగం దట్టమైన మంట, పొగలు చిమ్ముతున్నా.. రమేశ్ మాత్రం తన చేతిలో ఫోన్ పట్టుకుని రోడ్డు వైపు నడిచాడు. అయితే సమీపంలో ఉన్న కొందరు వ్యక్తులు .. రమేశ్‌ను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
రమేశ్ తెలుపు రంగు టీషర్ట్ ధరించినట్లు వీడియోలో ఉన్నది. ఎడమ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం.. టేకాఫ్ తీసుకున్న 32 సెకన్లకే కుప్పకూలింది. ఎమర్జెన్సీ గేటు సమీపంలోని 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ ఒక్కడే ఆ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలా తాను బ్రతికానో చెప్పడం కష్టమే అని అతను మీడియాకు చెప్పాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ సహా ఇతరులు పరామర్శించారు.
અવિશ્વસનીય પરંતુ સત્ય!
અમદાવાદ પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો વધુ એક વિડિઓ સામે આવ્યો.
દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ. #AhmedabadPlaneCrash pic.twitter.com/94WDepkKjn
— Sagar Patoliya (@kathiyawadiii) June 16, 2025