INDW vs NZW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు (Team India) తొలి పోరుకు వేళైంది. ఎనిమిదేండ్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా లీగ్ దశ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ (Newzealand)తో తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవినె (Sophie Devine) బ్యాటింగ్ తీసుకుంది. వరల్డ్ కప్‌లో ఇరుజట్లు చెరో రెండు విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయియి.
అయితే. ఈమధ్య టీ20ల్లో భారత్‌పై కివీస్‌దే పై చేయి అయింది. ఏకంగా 13 మ్యాచుల్లో న్యూజిలాండ్ 9 విజయాలతో సత్తా చాటింది. దాంతో.. కివీస్‌పై మెరుగైన రికార్డు లేని హర్మన్‌ప్రీత్ సేన సమిష్ఠి పోరాటంతో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలంటే పవర్ ప్లేలోనే రేణుకా సింగ్ వికెట్లతో చెలరేగాలి.
మిడిల్ ఓవర్లలో దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, యువ కెరటం శ్రేయాంకలు వికెట్లు తీస్తూనే.. పరుగులకు అడ్డుకట్టే వేయాలి. ఇక ఛేదనలో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు శుభారంభం ఇవ్వడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
New Zealand have the historical edge, but India won their last two encounters at the #T20WorldCup 👀 pic.twitter.com/JpBamfM5kd
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2024
భారత జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అశా శోభన, రేణుకా సింగ్.
న్యూజిలాండ్ జట్టు : సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా ఖేర్, సోఫీ డెవినె(కెప్టెన్), బ్రూకె హల్లడే, మడ్డీ గ్రీన్, ఇసబెల్లా గాజె(వికెట్ కీపర్), జెస్ కేర్, రోస్మెరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.