Jio Cinema – Ishan Chatergy | రిలయన్స్ (Relaince) అనుబంధ ఓటీటీ ప్లాట్ఫామ్ (OTT Platform) జియో సినిమా (Jio Cinema) చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా యూ-ట్యూబ్ ఇండియా మాజీ ఎండీ ఇషాన్ చటర్జీ నియమితులయ్యారు. ఇషాన్ చటర్జీని తమ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా నియమించుకుంటున్నట్లు జియో సినిమా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ అనుబంధ వయాకాం18- డిస్నీ స్టార్ ఇండియా సంస్థలు విలీనం కానున్న నేపథ్యంలో జియో సినిమా చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా ఇషాన్ చటర్జీ నియామకం కావడం గమనార్హం. గతంలో ఆయన మెకెన్సీ, హిందూస్థాన్ యూనీ లివర్ వంటి సంస్థల్లో పని చేశారు. జియో సినిమా కస్టమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవం అందించడానికి, తమ ప్లాట్ ఫామ్ నిబద్ధతకు నిదర్శనం అని జియో సినిమా పేర్కొంది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా జియో సినిమా మోనటైజేషన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారని తెలుస్తున్నది.