BCCI | విశ్రాంత ఐపీఎస్‌కు కీలక పదవి.. మ్యాచ్ ఫిక్సింగ్ భూతాన్ని తరిమేస్తాడా?
BCCI : భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ మాఫియా, అవినీతి కేసుల(Curruption Case)కు ఇక శుభం కార్డు పడనుంది. అవును.. దేశవాళీ, సీనియర్ స్థాయిలో అవినీతిని రూపుమాపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
BCCI : భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ మాఫియా, అవినీతి కేసులకు ఇక శుభం కార్డు పడనుంది. అవును.. దేశవాళీ, సీనియర్ స్థాయిలో అవినీతిని రూపుమాపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ (Sharad Kumar)ను అవినీతి నిరోధక విభాగానికి కొత్త అధిపతిగా నియమించింది.
ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధిపతిగా ఉన్న ఐపీఎస్ కేకే మిశ్రా పదవీ కాలం ముగిసింది. దాంతో, మిశ్రా స్థానంలో శరద్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 29న బెంగళూరులో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలోనే యాంటీ కరప్షన్ విభాగం హెడ్‌గా శరద్ పేరు ఖరారు చేశారని సమాచారం.
శరద్ కుమార్

హర్యానా కేడర్‌కు చెందిన శరద్ కుమార్ ఐపీఎస్‌గా పలు హోదాల్లో పనిచేశారు. శరద్‌కు అతిపెద్ద ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసిన అనుభవం ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు 2013 నుంచి 2017 వరకూ.. నాలుగేండ్లు బాస్‌గా సేవలందించిన శరద్ కుమార్ ఆ తర్వాత కేంద్ర నిఘా సంస్థలో కమిషనర్‌గానూ పనిచేశారు. ఇప్పుడు బీసీసీఐ పరిధిలో అవినీతి భూతాన్ని తరిమికొట్టనున్నాడు. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలపై, బెట్టింగ్ ముఠాలపై, లెక్క చూపని లావాదేవీలపై ఆయన దృష్టి సారించే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
- WIW vs SAW | చెలరేగిన తంజిమ్, లారా.. మాజీ చాంపియన్‌కు ఘోర పరాభవం
- Prakash Raj | తెలుగు సినిమా హీరోల్లో నాకు నచ్చిన నటుడు ఎన్టీఆర్ : ప్రకాశ్ రాజ్
- Jaipur airport | జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. Video
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

