జయశంకర్భూపాలపల్లి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పరకాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మున్సిపల్ కార్మికుల పొట్టగొడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. వారి జీతాలు తగ్గిస్తూ సరారు విడుదల చేసిన 1181 జీవోను రద్దుచేసి, పాత విధానంలోనే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో ఒకో కార్మికుడికి రూ.2వేల నుంచి రూ.4,500 వరకు జీతం తగ్గుతుందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. కార్మికులే కదా అని తకువ అంచనా వేయొద్దని, వారి సమస్యను పరిషరించకపోతే తామంతా కార్మికుల వెనుక నిలబడతామన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు కార్మికుల సమస్యలు పరిషరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీని స్తంభింపజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ మాజీ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్, సెగ్గం సిద్దు, హరీశ్‌రెడ్డి, జక్కం రవికుమార్, నారాయణ, చిరంజీవి యాదవ్, చుక్క బాలరాజు, కిరణ్‌కుమార్, తిరుపతి పాల్గొన్నారు.