న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ(Netanyahu) ప్రసంగించారు. ఇరాన్, గాజాతో పాటు పశ్చిమాసియాలో చేపట్టిన సైనిక చర్యను ఆయన సమర్ధించుకున్నారు. అయితే నెతన్యహూ ప్రసంగం మొదలుపెట్టేందుకు స్టేజ్ ఎక్కగానే.. అనేక దేశాల ప్రతినిధులు ఆ సభ నుంచి వాకౌట్ చేశారు. శత్రు దేశాలతో తమ పోరాటం ఆగదు అని ఆయన అన్నారు. మేం గెలవబోతున్నాం, మాకు మరో అవకాశం లేదని ఆయన యూఎస్ జనరల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. సభ నుంచి వాకౌట్ చేసిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఒకవేళ ఎవరైనా హాల్ నుంచి వెళ్లని పరికిపందలు ఉంటే వాళ్లు వెళ్లిపోవచ్చు అని ఆయన అన్నారు. గాజాలో ఊచకోత జరుగుతుందన్న వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
#WATCH | New York | Delegates from various countries leave the UN General Assembly hall as Israeli Prime Minister Benjamin Netanyahu begins his speech
Israeli Prime Minister Benjamin Netanyahu says, “Before I begin, just a quick announcement: if there are any other moral cowards… pic.twitter.com/CBbFqwpEOe
— ANI (@ANI) September 24, 2026