Devara – Anirudh Ravichander | ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకకు.. ముఖ్య అతిథులుగా.. ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ, రాజమౌళి, అనిరుధ్ రవిచందర్, నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాశ్ రాజ్ తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా ఎందుకు నచ్చింది అంటే. ఈ సినిమా కోసం శివ చెప్పిన ఐడియా.. దానిని నమ్మిన తారక్. మనం అనుకున్నట్లు రెగ్యూలర్ సినిమాలు చేయవచ్చు. కానీ కొత్తగా చేస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది. ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా.. కానీ కథను నమ్మి ఈ సినిమా చేశాం. నాకు తారక్ మీదా ఎంత ప్రేమంటే.. అతడు ఆస్కార్ ఫంక్షన్లో ఉన్నప్పుడు నా ఇంట్లో కుర్చోని వీడియో చూస్తుంటే.. ఎంతోమంది దిగ్గజాల ముందు అతడు మాట్లాడుతుంటే ఎంతో గర్వించాను. తెలుగు సినిమాలో నాకు నచ్చిన హీరోల్లో నటుడు అని ఎవరైన ఉన్నారు అంటే అది తారక్. ఈ సినిమా కోసం ఒక దర్శకుడికి అండగా నిలబడ్డాడు తారక్. ఈ మూవీ ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరికి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకోచ్చాడు.