WIW vs SAW : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలన విజయం. ఎనిమిదేండ్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా (South Africa) తొలి కప్ వేటను ఘనంగా మొదలెట్టింది. లీగ్ దశ తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ (West Indies)పై 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
శుక్రవారం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో తొలుత బంతితో కరీబియన్లను వణికించిన సఫారీలు.. ఆ తర్వాత బ్యాటుతో బాదేశారు. ఓపెనర్లు లారా వొల్వార్డ్త్(59 నాటౌట్), తంజిమ్ బిస్త్(57 నాటౌట్), అర్ధ శతకాలతో చెలరేగారు. మెగా టోర్నీలో అద్భుత రికార్డు కలిగిన విండీస్ బౌలర్లను ఉతికేస్తూ అజేయంగా జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ ఇద్దరి విధ్వంసంతో సఫారీలు వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టారు.
A confident 10-wicket win to start South Africa’s Women’s #T20WorldCup 2024 👊#SAvWI #WhateverItTakes
📝: https://t.co/5GJL3RC05E pic.twitter.com/TXo2QrvWVk
— ICC (@ICC) October 4, 2024
మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో లీగ్ దశ తొలి మ్యాచ్. అయినా సరే దక్షిణాఫ్రికా కంగారు పడలేదు. మొదట బౌలింగ్ తీసుకొని . హిట్టర్లతో నిండిన కరీబియన్ జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. అనంతరం 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. పవర్ ప్లేలోనే ఓపెనర్ తంజిమ్ బ్రిస్ట్(57 నాటౌట్), కెప్టెన్ లారా వొల్వార్డ్త్(59 నాటౌట్)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
Impressive fifties from Laura Wolvaardt and Tazmin Brits guide the South Africa chase 👏#WhateverItTakes #T20WorldCup #SAvWI pic.twitter.com/nl0pFqmR9G
— ICC (@ICC) October 4, 2024
ఆ తర్వాత కూడా ఈ జోడీ జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలతో వెస్టిండీస్ బౌలర్ల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసింది. దాంతో, కరీబియన్ కెప్టెన్ హీలీ మాథ్యూస్ బౌలర్లను మర్చినా ఫలితం లేకపోయింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో విండీస్‌ను ఒత్తిడిలో పడేసిన లారా, బ్రిస్ట్లు అజేయంగా జట్టును గెలిపించారు. 10 వికెట్ల విజయంతో దక్షిణాఫ్రికా రెండు పాయింట్లతో పాటు మంచి రన్ రేటు సొంతం చేసుకుంది.
టాస్ ఓడిన వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్. 15 పరుగులకే ఆల్‌రౌండర్ మరిజానే కాప్(2/14) ఓపెనర్ హేలీ మాథ్యూస్(10)ను బోల్తా కొట్టించింది. ఆ తర్వాత బంతి అందుకున్న నొన్‌కులులెకో లబా(4/29) మరో ఓపెనర్ క్వియానా జోసెఫ్(4)ను బౌల్డ్ చేసి విండీస్‌ను ఒత్తిడిలో పడేసింది.
Nonkululeko Mlaba’s four-wicket haul broke the back of the West Indies batting order 👊
She’s the @aramco POTM from South Africa’s opening encounter 🏅 #T20WorldCup | #WhateverItTakes pic.twitter.com/Hg7XhQda2t
— ICC (@ICC) October 4, 2024
అయితే.. స్టఫానీ టేలర్(44), విధ్వంసక ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ (13)లు ధనాధన్ ఆడి జట్టును ఆదుకున్నారు. కానీ.. మరిజానే మరోసారి జట్టుకు బ్రేక్‌నిస్తూ డాటిన్‌ను వెనక్కి పంపింది. దాంతో.. 62 పరుగులకే విండీస్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో టేలర్, జైదా(15 నాటౌట్)లు బౌండరీలతో విరుచుకుపడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.