Man Avenge Father’s Death | తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న కొడుకు.. 22 ఏళ్ల తర్వాత ఏం చేశాడంటే?
Man Avenge Father's Death | ఒక వ్యక్తి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తండ్రిని చంపిన వ్యక్తిని అదే తరహాలో హత్య చేశాడు. తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అది హత్యగా నిర్ధారించారు.
అహ్మదాబాద్: ఒక వ్యక్తి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తండ్రిని చంపిన వ్యక్తిని అదే తరహాలో హత్య చేశాడు. (Man Avenge Father’s Death) తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అది హత్యగా నిర్ధారించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 1న అహ్మదాబాద్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని 50 ఏళ్ల నకత్ సింగ్ భాటీగా గుర్తించారు. సైకిల్‌పై వెళ్తున్న అతడ్ని ఒక వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా పోలీసులు భావించారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. వాహనం నడిపిన ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నకత్ సింగ్‌ను ఢీకొట్టి హత్య చేసినట్లు గ్రహించారు. నిందితుడ్ని గోపాల్ సింగ్ భాటీగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు 2002లో రాజస్థాన్‌లో గోపాల్ సింగ్ తండ్రిని నకత్ సింగ్ వాహరంతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో 22 ఏళ్ల తర్వాత అతడు తన తండ్రి మరణానికి అదే తరహాలో ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

