Devara Movie Success Event | ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.393 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తాజాగా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ వేడుకకు.. ముఖ్య అతిథులుగా.. ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ, రాజమౌళి, నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. నేను విజయాలు చాలా సార్లు చూశాను కానీ.. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తారక్‌తో ఈ విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది సక్సెస్ అనడం కంటే ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ఈ ఎమోషన్‌ను ఇంత అందంగా చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికి నా పాదాభివందనాలు. ఈ సినిమా చేయడం అనేది నా ఒక్కడి వలన అయితే సాధ్యం కాకపోవచ్చు. కానీ నాకు దొరికిన వండర్ఫుల్ టీం వలన ఇది సాధ్యమయ్యింది. అలాగే వెన్నంటే ఉండి నన్ను ఎంకరేజ్ చేసిన నా నిర్మాతలకు ధన్యవాదాలు. అందరికంటే స్పెషల్.. ఈ సినిమా కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అంటూ నన్ను ప్రోత్సహించిన తారక్ అన్నయ్యకు స్పెషల్ స్పెషల్ థాంక్స్ అంటూ కొరటాల చెప్పుకోచ్చాడు.