T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. విశ్వ వేదికపై ఈ రెండు జట్లు తలపడితే ఆరోజు స్టేడియం కిక్కిరిసిపోవడమే కాదు నిర్వాహకులకు కోట్లలో డబ్బు సమకూరుతుంది. టికెట్ల అమ్మకాల రూపంలో భారీ ఆదాయం మాట అటుంచితే.. మ్యాచ్ మధ్యలో వచ్చే ప్రకటన ద్వారా మరింత డబ్బు వచ్చిపడుతుంది. అందుకనే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కోసం అభిమానులే కాదు టీవీ ఛానెళ్లు, వ్యాపార సంస్థలు కోటి కళ్లతో ఎదురుచూస్తాయి.
ఇప్పుడు దాయాది జట్లు మరోసారి టీ20 వరల్డ్ కప్‌లో తొలి సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే జూన్ 9 మ్యాచ్ కోసం న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ మధ్యలో ప్రకటనలకు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు భారీగా పైసలు వసూల్ చేస్తున్నాయి. వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ మధ్య ఒక్క సెకన్ యాడ్‌కు 4,800 డాలర్లు అంటే రూ.4 లక్షలు తీసుకుంటున్నాయట.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎప్పుడైనా సరే ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకని ఈ మ్యాచ్‌ను ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు సెకన్‌కు లక్షల్లో సంపాదిస్తున్నాయి. నిరుడు భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లోనూ యాడ్ రెవెన్యూ బోలెడు వచ్చింది. 10 సెకన్ల ప్రకటనకు రూ.30 లక్షలు చార్జ్ చేశారని సమాచారం. వరల్డ్ కప్ చరిత్రలో పాక్‌పై గొప్ప రికార్డు కలిగిన టీమిండియా న్యూయార్క్‌లోనూ విజయంపై కన్నేసింది. తొలి పోరులో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన..ఓటమి బాధలో ఉన్న పాక్‌ను మరింత కుంగదీసేందుకు వ్యూహాలు పన్నుతోంది.