Nikhil Siddharth | టాలీవుడ్ నటుడు నిఖిల్ తెలుగుదేశం పార్టీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపాడు. నేడు లోకేష్ నివాసంకు వెళ్లిన నటుడు నిఖిల్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటిచేసి ఘనవిజయం సాధించిన ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక నిఖిల్‌తో పాటు అతడి మామా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ కూడా లోకేష్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాడు.
ఇటీవల కార్తికేయ-2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో నభ నటేష్‌తో పాటు సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Hero #Nikhil met the dedicated Leader of TDP Shri @NaraLokesh and congratulated him on his Massive Victory in Mangalagiri as MLA along with his Mamayya, #MMKondaiah who won as Chirala MLA @Actor_Nikhil @JaiTDP pic.twitter.com/Ea9AJ3hMGx
— Vamsi Kaka (@vamsikaka) June 7, 2024