Ajit Pawar – Baramati | బారామతి ఫలితం ఆశ్చర్యకరం.. కుటుంబ విషయాలపై అజిత్ పవార్ ఏమన్నారు..?!
Ajit Pawar - Baramati | బారామతి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ఫలితం ఆశ్చర్యకరంగా ఉన్నదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
Ajit Pawar – Baramati | ప్రతిష్ఠాత్మక స్థానం బారామతి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక ఫలితంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. కుటుంబ వ్యవహారాలను బహిరంగ చర్చలోకి తేవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలంతా తనకు మద్దతు పలికినా బారామతి లోక్ సభ స్థానంలో ఫలితం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బారామతిలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌పై శరద్ పవార్ కూతురు, సుప్రియా సూలే భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుకు తనదే బాధ్యత అని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. తమ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరు శరద్ పవార్ వర్గంతో కలుస్తారని వస్తున్న వదంతులను తమ ఎమ్మెల్యేలంతా తిరస్కరించారన్నారు. ఎమ్మెల్యేలు అందరూ తనతోనే ఉన్నారన్నారు. ‘విపక్షం ఏదైనా మాట్లాడొచ్చు. నాకు ప్రజల నుంచి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఎల్లవేళలా మద్దతు ఉంది. అందరూ నా వెంటే ఉంటాం అని హామీ ఇచ్చారు’ అని అజిత్ పవార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

