మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 00:09:40

హైదరాబాద్‌ ఓపెన్‌తో మొదలు

హైదరాబాద్‌ ఓపెన్‌తో మొదలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలలుగా వాయిదా పడ్డ బ్యాడ్మింటన్‌ టోర్నీలు.. హైదరాబాద్‌ ఓపెన్‌ (ఆగస్టు 11 నుంచి 16)తో పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) శుక్రవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ అయిన ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాస్తవానికి మార్చి 24-29 మధ్య జరుగాల్సింది కానీ.. ఆల్‌ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత కొవిడ్‌-19 కారణంగా బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీలన్నింటిని రద్దు చేసింది. ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి రావడంతో తిరిగి నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం న్యూఢిల్లీ వేదికగా ఇండియా ఓపెన్‌ డిసెంబర్‌ 8-13 మధ్య జరుగనుంది. 


logo