e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News దారితప్పి వచ్చిన బాలుడు.. పాక్‌కు అప్పగింత

దారితప్పి వచ్చిన బాలుడు.. పాక్‌కు అప్పగింత

దారితప్పి వచ్చిన బాలుడు.. పాక్‌కు అప్పగింత

అహ్మదాబాద్‌ : అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటి భార‌త్ భూభాగంలోకి ప్ర‌వేశించిన‌ బాలుడిని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది శనివారం తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించింది. రాజస్థాన్‌లోని బార్మేర్‌ సెక్టార్‌ సోమ్‌రార్‌ ఔట్‌పోస్టు వద్ద శుక్రవారం పాక్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది బాలుడిని ఫ్లాగ్‌ మీటింగ్‌లో పాకిస్థాన్‌ రేంజర్లకు అప్పగించింది.

ఏప్రిల్‌ 2న కరీం(8) అనే బాలుడు అనుకోకుండా సరిహద్దును దాటిరాగా పహారాలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కంటబడ్డాడు. తిరిగి వెళ్లాల్సిందిగా అడగగా యూనిఫాంలో ఉన్న సిబ్బందిని చూసి బాలుడు ఏడవడం మొదలుపెట్టాడు. తినుబండారాలు, నీళ్లు ఇచ్చి బాలుడిని ఊరుకోబెట్టారు. సోమ్‌రోర్‌కు అతిసమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన గ్రామం నుండి బాలుడు దారితప్పి వచ్చినట్లుగా గుర్తించారు. హెడ్‌క్వార్టర్స్‌ ఆదేశాల మేరకు ఫ్లాగ్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేసి బాలుడిని అప్పగించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దారితప్పి వచ్చిన బాలుడు.. పాక్‌కు అప్పగింత

ట్రెండింగ్‌

Advertisement