IND vs SL | భారత ఇన్నింగ్స్ 8 ఓవర్లకు కుదింపు.. ఎంత కొట్టాలంటే..?
IND vs SL : పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా(India) ఇన్నింగ్స్‌ను అంపైర్లు కుదించారు. భారత జట్టు విజయ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్దేశించారు.
IND vs SL : పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా(India) ఇన్నింగ్స్‌ను అంపైర్లు కుదించారు. వరుణుడి అంతరాయం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో భారత జట్టు విజయ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్దేశించారు.
ఔట్ ఫీల్డ్ కొంచెం పొడిగా ఉండడంతో 10:45కు మ్యాచ్ మొదలవ్వనుంది. శ్రీలంక నిర్దేశించిన 162 పరుగుల ఛేదనలో భారత జట్టు తొలి ఓవర్లోనే వాన మొదలైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికీ స్కోర్ 60/. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(6), సంజూ శాంసన్(0)లు క్రీజులో ఉన్నారు.
బిష్ణోయ్ తిప్పేయడంతో..
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వరంలో పొట్టి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్ రెండో టీ20లో శ్రీలంకను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(3/26) తిప్పేయడంతో ఆతిథ్య జట్టు 161 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడిన లంకకు శుభారంభం లభించినా భారత బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
Kusal Perera gave Sri Lanka the platform but much like yesterday, their middle order crumbled quickly 📉
India set a target of 162 🎯https://t.co/ITR4nipG5J | #SLvIND pic.twitter.com/34wwuMWtk7
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2024
అయితే.. కుశాల్ పెరీర(53) హాఫ్ సెంచరీతో శ్రీలంకను ఆదుకున్నాడు. ఓపెనర్ పథుమ్ నిశాంక(32) మినహా మిగతావాళ్లు ఎవరూ రాణించలేదు. దాంతో, లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(2/30), అర్ష్‌దీప్ సింగ్(2/24)లు రాణించారు.
ఇవి కూడా చదవండి
- ENG vs WI | ఇరగదీసిన వుడ్, స్టోక్స్.. టెస్టు సిరీస్‌లో విండీస్ వైట్‌వాష్
- IND vs SL | భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం.. స్కోర్ ఎంతంటే?
- Samsung Galaxy A06 | త్వరలో భారత్ మార్కెట్లోకి శాంసంగ్ ఎంట్రీ లెవల్ ఫోన్ గెలాక్సీ ఏ06 ఫోన్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

