IND vs SL : టీమిండియా ఇన్నింగ్స్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. శ్రీలంక నిర్దేశించిన 162 పరుగుల ఛేదనలో భారత జట్టు తొలి ఓవర్లోనే వాన మొదలైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికీ స్కోర్ 6/0. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(6), సంజూ శాంసన్(0)లు క్రీజులో ఉన్నారు. వాన కాసేపటికే తగ్గినా తడి ఔట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ఆలస్యం కానుంది. భారత జట్టు విజయానికి ఇంకా 19.3 ఓవర్లలో 156 పరుగులు కావాలి.
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వరంలో పొట్టి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్ రెండో టీ20లో శ్రీలంకను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(3/26) తిప్పేయడంతో ఆతిథ్య జట్టు 161 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడిన లంకకు శుభారంభం లభించినా భారత బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
Bowlers shared the spoils as Sri Lanka are restricted to 161/9 👍 👍
India’s chase has begun with #TeamIndia 6/0!
Scorecard ▶️ https://t.co/R4Ug6MQGYW#SLvIND pic.twitter.com/NUC7ppjRcG
— BCCI (@BCCI) July 28, 2024
అయితే.. కుశాల్ పెరీర(53) హాఫ్ సెంచరీతో శ్రీలంకను ఆదుకున్నాడు. ఓపెనర్ పథుమ్ నిశాంక(32) మినహా మిగతావాళ్లు ఎవరూ రాణించలేదు. దాంతో, లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(3/26), అక్షర్ పటేల్(230), అర్ష్‌దీప్ సింగ్(2/24)లు రాణించారు.