KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జిల్లాల పర్యటనతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుయుక్తులను చిత్తుచేస్తూ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను జిల్లాల వారీగా అభినందిస్తున్న ఆయన రేపు ఖమ్మంలో పర్యటించనున్నారు. మంగళవారం జనగామ జిల్లాను గులాబీమయం చేసిన కేటీఆర్ .. బుధవారం ఖమ్మం ఖిల్లాలో అభినందన సభలో పాల్గొంటారు.
ఖమ్మం పర్యటనకు కేటీఆర్ బుధవారం ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. నార్సింగి , వయా సూర్యాపేట మీదుగా ఆయన ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 10:30 గంటలకు జిల్లా కేంద్రంలోని రాపర్తి నగర్ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను కేటీఆర్ అభినందిస్తారు.
✳️ జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ 👇🏻
♦️ ముఖ్యమంత్రికి ఏం తెల్వదు.. మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదు.
♦️ నీళ్ల… pic.twitter.com/GKik03NOlC
— BRS Party (@BRSparty) January 6, 2026