ENG vs WI : సొంతగడ్డపై చెలరేగి ఆడుతున్న ఇంగ్లండ్(England) టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్(West Indies)ను వైట్‌వాష్ చేసింది. ఆఖరిదైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ విజయంతో 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన మార్క్‌వుడ్(5/40) ఆతిథ్య జట్టు పని తేలిక చేశాడు. అనంతరం స్వల్ప ఛేదనలో కెప్టెన్ బెన్ స్టోక్స్(57 నాటౌట్) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో, ఇంగ్లండ్ వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను హస్తగతం చేసుకుంది.
ఇంగ్లండ్ పర్యటనలో వెస్టిండీస్ జట్టులో అనుభవలేమీ కొట్టిచ్చినట్టు కనపడింది. వరుసగా రెండు టెస్టుల్లో చిత్తైన కరీబియన్ టీమ్ మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(61), జేసన్ హోల్డర్(59)ల పోరాటంతో 282 రన్స్ చేసిన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 175 కే చాప చుట్టేసింది.
Fast-bowling music ft. Mark Wood ⚡️#ENGvWI pic.twitter.com/5aXrNIj9YM
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2024
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఐదు వికెట్లతో బ్రాత్‌వైట్ సేనను వణికించాడు. అనంతరం 87 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బెన్ స్టోక్స్(57 నాటౌట్) వేగవంతమైన అర్ధ శతకం బాదాడు. ధనాధన్ ఆడిన ఇంగ్లీష్ జట్టు సారథి 24 బంతుల్లోనే యాభై కొట్టేశాడు. దాంతో, ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన క్రికెటర్‌గా స్టోక్స్ రికార్డు నెలకొల్పాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్(25 నాటౌట్) దంచడంతో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.