Samsung Galaxy A06 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ06 (Samsung Galaxy Ao6) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఎల్ఈడీ ఫ్లాష్తోపాటు డ్యుయల్ కెమెరా సెటప్ తో వస్తోందీ ఫోన్. గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ఫోన్లలో మాదిరిగా కీ ఐలాండ్ తోపాటు, ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ06 (Samsung Galaxy Ao6) ఫోన్ 15వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 6జీబీ ర్యామ్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ06 ఫోన్ 6.7 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్, విత్ మీడియా టెక్ హెలియో జీ85 ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్లె తదితర ఫీచర్లు ఉంటాయని సమాచారం. బ్లాక్ కలర్ ఆప్షన్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ06 ఫోన్ వస్తుందని తెలుస్తున్నది.
August Bank Holidays | ఆగస్టులో 13 రోజులూ బ్యాంకులకు సెలవులు.. కారణమిదే..!