Narasimha Re Union | సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమాల్లో ‘పడయప్పా’ (తెలుగులో నరసింహా)కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1999లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, రజనీ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. థియేటర్ల వద్ద ఏర్పడిన సందడి, అభిమానుల హంగామా ఇప్పటికీ సినీ ప్రేమికుల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా తెలుగునాట ఈ సినిమా సాధించిన విజయం, రజనీకాంత్ క్రేజ్‌కు సరికొత్త అధ్యాయాన్ని తెరిచింది.ఇప్పటికే పాత హిట్ సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో, నరసింహాని కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రజనీకాంత్ సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ క్లాసిక్ మూవీని ప్రత్యేకంగా రీ రిలీజ్ చేశారు.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులను ఊపేసాయి. అదే సమయంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర సినీ చరిత్రలోనే గుర్తుండిపోయే విలన్ క్యారెక్టర్‌గా నిలిచింది. హీరోయిన్ను విలన్‌గా చూపించి ఆ పాత్రకు అంతటి బలం ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనమే. ఈ కథకు సీక్వెల్ ఆలోచన కూడా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది . రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ, మేకర్స్ పార్ట్ 2పై చర్చలు జరుపుతున్నారని టాక్. ముఖ్యంగా ఈ సీక్వెల్లో మళ్లీ రమ్యకృష్ణ నీలాంబరిగా కనిపించే అవకాశం ఉందన్న వార్తలు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
1999లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ ఓ సంచలనమే. ‘నా దారి రహదారి’ అంటూ తలైవా చెప్పే డైలాగ్, స్టైల్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు.అయితే ఈ మూవీ రీ రిలీజ్ అయి కూడా సంచలన విజయం సాధించింది. దీంతో నరసింహ మూవీ యూనిట్ రజినీకాంత్, రమ్యకృష్ణ, డైరెక్టర్ KS రవికుమార్, నిర్మాత ఒకేచోట కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరసింహ రీ యూనియన్ అంటూ రమ్యకృష్ణ, రజినీకాంత్ ఫోటోలకు పోజులివ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. రజినీకాంత్, రమ్యకృష్ణ, నరసింహ సినిమా ఫ్యాన్స్ ఈ పిక్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.