Temperatures | రాష్ట్రంలో హడలెత్తిస్తున్న ఎండలు..25 జిల్లాల్లో 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
ఏప్రిల్, మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
- 25 జిల్లాల్లో 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
- ఏప్రిల్, మేలో మరింత పెరిగే అవకాశం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్, మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 37.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
సాధారణంగా ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత పెరుగుతుందని, కానీ ఈసారి మార్చి నెలలోనే సూర్యుడు సెగలు కక్కుతున్నాడని వివరించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో వేడి తీవ్రత ఎకువగా ఉంటుందని పేర్కొన్నది. ప్రజలు బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్తోపాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఎండల తీవ్రత, వేడి గాలులు, ఉకపోతతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

