నాడు కలవలేకపోయా.. నేడు కలిసి నటించా..!
“విశ్వనాథ్ అండ్ సన్స్'లో సూర్యసార్తో కలిసి నటించడం నిజంగా నాకు అనుకోని వరమే’ అంటున్నది కేరళ కస్తూరి మమితాబైజు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్లో ఉన్నది ఈ అందాల భామ. ఆమె సూర్యకు జోడీగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న విడుదల కానున్నది.
“విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్యసార్తో కలిసి నటించడం నిజంగా నాకు అనుకోని వరమే’ అంటున్నది కేరళ కస్తూరి మమితాబైజు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్లో ఉన్నది ఈ అందాల భామ. ఆమె సూర్యకు జోడీగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఈ నెల 14న విడుదల కానున్నది. ఈ సందర్భంగా కొచ్చీలో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో సూర్య అభిమానిగా మారిపోయింది మమితాబైజు. 2015లో సూర్యను కలవాలని తాను ప్రయత్నించిన క్షణాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నది.
‘2015లో నేను 8వ తరగతి చదువుతున్నాను. అదే స్కూల్లో మా అన్నయ్య 11వ తరగతి చదువుతున్నాడు. ఆ ఏడాది ఏదో సినిమా ఈవెంట్కి కొచ్చీలోని ఓ మాల్కి సూర్యసార్ వచ్చారు. దాంతో మా అన్నయ్య.. తన స్నేహితులతో కలిసి సూర్య సార్ని చూసేందుకు కొచ్చీ వెళ్లాడు. అప్పుడు అన్నయ్యతో కలిసి నేనూ కొచ్చీ వెళ్లాలని ట్రై చేశాను. కానీ అమ్మానాన్న వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత సూర్యసార్తో దిగిన ఫొటోలను మా అన్నయ్య నాకు చూపించాడు. వాటిని చూసి నిరాశకు లోనయ్యాను. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాను. ప్రస్తుతం ఆయనతో కలిసి ఇక్కడ నిలబడ్డాను. ఇది నాకొక గొప్ప గౌరవం’ అంటూ భావోద్వేగానికి లోనయింది మమితాబైజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

